PM-KISAN: పీఎం-కిసాన్ మొత్తం పెంపుపై కేంద్రం క్లారిటీ
PM-KISAN: పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పెంచే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టంచేసింది. ప్రస్తుతం రూ.6వేలుగా ఉన్న మొత్తాన్ని పెంచుతారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
దిల్లీ: రైతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) మొత్తాన్ని పెంచుతారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6వేలు చొప్పున కేంద్రం అందిస్తోంది. రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తానికి మరో రూ.2వేలు జత చేస్తారని, బడ్జెట్‌లో ఆ మేర బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని అంతా ఆశించారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
తాజాగా కిసాన్ సమ్మాన్ నిధి పెంపుపై తాజాగా కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి పీఎం-కిసాన్ మొత్తాన్ని పెంచే ఉద్దేశమేదీ లేదని కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జనవరి 30 వరకు అర్హులైన రైతులకు మొత్తం రూ.2.24 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నూరు శాతం నిధులు సమకూరుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saeed Rashed: నాలుగేళ్ల కుర్రాడు.. రికార్డు సృష్టించాడు
-
India News
PM CARES Fund: పీఎం సహాయ నిధికి మరో రూ.100 కోట్లు
-
World News
UNSC: రష్యా చేతికి యూఎన్ఎస్సీ పగ్గాలు.. ‘చెత్త జోక్’గా పేర్కొన్న ఉక్రెయిన్!
-
General News
Hyderabad: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించాలి: సీఎస్ శాంతి కుమారి
-
India News
IMD: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో.. అధిక ఉష్ణోగ్రతలే!
-
Politics News
Bandi sanjay: భారాస, కాంగ్రెస్కు తోడు సూది, దబ్బనం పార్టీలు: బండి సంజయ్ ఎద్దేవా