Simultaneous polls: ‘జమిలి’పై నివేదికకు కోవింద్‌ కమిటీకి నిర్దిష్ట కాలపరిమితి లేదు: కేంద్రం

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీకి నిర్దిష్ట గడువు ఏమీ విధించలేదని కేంద్రం తెలిపింది.

Published : 02 Feb 2024 19:08 IST

దిల్లీ: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ramnath kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తన నివేదిక సమర్పించేందుకు నిర్దిష్టమైన కాలపరిమితి ఏదీ లేదని కేంద్రం తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక అంశంపై రాజకీయ పార్టీల నుంచి ఇప్పటివరకు 35 స్పందనలు అందాయన్నారు. అయితే, ఈ కమిటీ నివేదిక సమర్పించేందుకు మాత్రం ఎలాంటి తుది గడువు విధించలేదని ఆయన స్పష్టంచేశారు. దేశంలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ కసరత్తులో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని