LS Polls: లోక్‌సభ సంగ్రామం.. ‘తొలి దశ’ నోటిఫికేషన్‌కు వేళాయే

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఈసీ వివరాల ప్రకారం ఈనెల 20న (బుధవారం) నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Published : 19 Mar 2024 22:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రక్రియకు తెరలేవనుంది. ఎన్నికల సంఘం (ECI) వివరాల ప్రకారం.. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా తొలిదశ (First Phase Polls)కు సంబంధించి బుధవారమే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో సంబంధిత పార్లమెంటు నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి మొదలు కానుంది. తొలి విడతలో మొత్తం 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు.

తొలి దశ వివరాలు..

  • నోటిఫికేషన్‌ తేదీ: మార్చి 20
  • నామినేషన్ల గడువు: మార్చి 27
  • నామినేషన్ల పరిశీలన: మార్చి 28
  • ఉపసంహరణకు ఆఖరు తేదీ: మార్చి 30
  • పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19

రాష్ట్రాలవారీగా స్థానాలు..

తమిళనాడు (39), రాజస్థాన్‌ (12), ఉత్తర్‌ప్రదేశ్‌ (8), మధ్యప్రదేశ్‌ (6), అస్సాం (5), మహారాష్ట్ర (5), ఉత్తరాఖండ్‌ (5), బిహార్‌ (4), పశ్చిమ బెంగాల్‌ (3), మణిపుర్‌ (2), అరుణాచల్‌ ప్రదేశ్‌ (2), మేఘాలయ (2), ఛత్తీస్‌గఢ్‌ (1), మిజోరం (1), నాగాలాండ్‌ (1), సిక్కిం (1), త్రిపుర (1), అండమాన్‌ నికోబార్‌ (1), జమ్మూకశ్మీర్‌ (1), లక్షద్వీప్‌ (1), పుదుచ్చేరి (1).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని