NEET UG 2025: ‘నీట్’ పరీక్షపై అసత్య ప్రచారం.. 120కి పైగా టెలిగ్రామ్, ఇన్‌స్టా ఛానళ్లపై చర్యలు!

దిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(యూజీ) పరీక్షకు (NEET UG 2025) సంబంధించి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఎన్‌టీఏ(NTA) చర్యలు చేపట్టింది. ఈ పరీక్షపై తప్పుదారిపట్టించే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్న దాదాపు 120కి పైగా సామాజిక మాధ్యమ ఖాతాల్ని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు సమాచారం. వీటిలో 106 టెలిగ్రామ్, 16 ఇన్‌స్టాగ్రామ్ ఛానళ్లు ఉన్నట్లు ఎన్‌టీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఛానళ్లపై తదుపరి దర్యాప్తు కోసం కేసులను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బదిలీ చేసినట్లు సమాచారం. అలాగే, అసత్య ప్రచారాన్ని, విద్యార్థుల్లో అనవసర భయాందోళనల్ని నివారించేందుకు ఈ ఛానళ్లను తొలగించాలని టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంస్థలను సైతం కోరినట్లు తెలుస్తోంది.
నీట్ ప్రశ్నపత్రం గురించి తప్పుడు ప్రచారం చేసే అనధికార వెబ్‌సైట్‌లు/సోషల్ మీడియా ఖాతాలు; పరీక్ష కంటెంట్ యాక్సెస్‌కు సంబంధించి క్లెయిమ్ చేసే వ్యక్తుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎన్‌టీఏ ఇటీవల కొత్త వేదికను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి అనుమానాస్పద కంటెంట్ ప్రచారం చేసినట్లు గుర్తిస్తే https://neetclaim.centralindia.cloudapp.azure.com/ ద్వారా రిపోర్టు చేయవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 1500కు పైగా ఫిర్యాదులు అందగా.. వీటిలో అధిక భాగం టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ ఏడాది మే 4న జరగనున్న నీట్ యూజీ పరీక్షకు రంగం సిద్ధం చేసింది. నీట్ అడ్మిట్ కార్డుల్ని నిన్ననే విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


