Delhi Metro: దిల్లీ మెట్రోవీడియో వైరల్‌.. స్పందించిన అధికారులు

దిల్లీ మెట్రో ట్రైన్‌లో ఇద్దరు యువతులు హోలీ ఆడుతున్నట్లు అభ్యంతరకరంగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో మెట్రో అధికారులు స్పందించారు.

Updated : 24 Mar 2024 14:26 IST

దిల్లీ: దిల్లీ మెట్రో ట్రైన్‌లో ఇద్దరు యువతులు హోలీ ఆడుతున్నట్లు అభ్యంతరకరంగా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలయ్యింది. దీనిపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది. 

వైరల్‌గా మారిన వీడియోలో ఇద్దరు యువతులు మెట్రో కోచ్‌లో కూర్చొని, ఒకరి బుగ్గలపై మరొకరు రంగు పౌడర్‌లను రాసుకుంటుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో హిందీ సినిమా పాట ప్లే అవుతోంది. బహిరంగ ప్రదేశాలలో అభ్యంతరకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మెట్రో అధికారులను కోరారు. అంతేకాక ఈ వీడియోను రూపొందించడానికి డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఉండవచ్చనే అనుమానాన్నీ డీఎంఆర్‌సీ వ్యక్తం చేసింది. 

ప్రయాణికులకు అవగాహన కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలు, ప్రచారాలు చేసినా కొందరు యువత పెడచెవిన పెడుతున్నారని మండిపడింది. తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా రీల్స్‌ చేయవద్దని ఎన్నోసార్లు అభ్యర్థించినా మార్పు రావట్లేదని పేర్కొంది. ఈ విధంగా వీడియోలు చేస్తున్న వారిని చూసిన వెంటనే  తెలియజేయాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు