Bridge Collapses: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఒకరి మృతి..

నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఓ కార్మికుడు మృతి చెందగా.. 30 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్న ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. 

Updated : 22 Mar 2024 14:08 IST

పట్నా:  బిహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. 30 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ కౌశల్‌ కుమార్‌(Kaushal Kumar) తెలిపారు. క్షతగాత్రులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెన కింద 40 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారని, ఇప్పటి వరకూ 9 మందిని రక్షించామని తెలియజేశారు. సుపాల్‌, మధుబని జిల్లాలను కలుపుతూ కోసి నదిపై 10.2 కిలో మీటర్ల మేర ఈ వంతెనను నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని