Vaccination for children: 12-14 ఏళ్ల వారికి టీకా.. ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయండి..

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. బుధవారం నుంచి 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో అన్ని

Published : 15 Mar 2022 21:35 IST

రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. బుధవారం నుంచి 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం నేడు పలు సూచనలు చేసింది. 12-14 ఏళ్ల వయసు పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యాక్సిన్లు కలిసిపోకుండా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరింది. 

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ నేడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశాల్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన పలు సూచనలు చేశారు. ‘‘12-14 ఏళ్ల పిల్లలకు ఇచ్చే టీకాలు ఇతర వ్యాక్సిన్లతో కలిసిపోకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టీకాలు ఇచ్చేవారికి దీనిపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు.

28 రోజుల వ్యవధితో రెండు డోసులు..

12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్‌ ఇ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కాగా.. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు అందించాలని స్పష్టం చేసింది. 2010 అంతకంటే ముందు జన్మించిన పిల్లలు ఈ టీకా తీసుకునేందుకు అర్హులని కేంద్రం పేర్కొంది. టీకా కోసం పిల్లల పేర్లను ఆన్‌లైన్‌లో కొవిన్‌ యాప్‌లో నమోదు చేయాలని వెల్లడించింది. లేదా వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని