Chardham Yatra: చార్‌ధామ్‌ యాత్ర... 15 రోజుల్లో 52 మంది మృతి

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన వారిలో గత 15 రోజుల్లో 52 మంది మృత్యువాత పడినట్లు గర్వాల్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌పాండే తెలిపారు.

Published : 24 May 2024 22:14 IST

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) మే 10న ప్రారంభమైన చార్‌ధామ్‌ యాత్రకు (Chardham Yatra) భక్తులు పోటెత్తుతున్నారు. అయితే, అక్కడి ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక గత 15 రోజుల వ్యవధిలో 52 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయినట్లు గర్వాల్‌ కమిషనర్‌ వినయ్‌శంకర్‌ పాండే తెలిపారు. వీరిలో ఎక్కువమంది 60 ఏళ్లకు పైబడినవారేనని చెప్పారు. గుండెపోటుతోనే ఎక్కువమంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. శుక్రవారం దెహ్రాదూన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గంగోత్రిలో (Gangotri) ముగ్గురు, యమునోత్రిలో (Yamunotri) 12 మంది, బద్రీనాథ్‌లో (Badrinath) 14 మంది, కేదార్‌నాథ్‌లో (Kedarnath) 23 మంది మృత్యువాత పడినట్లు చెప్పారు. 

50 ఏళ్లకు పైబడి చార్‌ధామ్‌ యాత్రికులకు వెళ్లేవారు తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మార్గమధ్యంలోనూ స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహస్తున్నామని, ఫిట్‌నెస్‌ సరిపోకపోతే ప్రయాణించవద్దని చెబుతున్నామని అన్నారు. అప్పటికీ యాత్రను కొనసాగించాలని భావిస్తే.. వారితో లేఖ రాయించుకొని ప్రయాణానికి అనుమతిస్తున్నామని చెప్పారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లుచేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఇప్పటివరకు 9,67,302 మంది యాత్రికులు చార్‌ధామ్‌ను సందర్శించినట్లు తెలిపారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా సాగుతూ బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని