Security Breach: పార్లమెంటులో అలజడి.. నిందితులకు పోలీస్‌ కస్టడీ పొడిగింపు

పార్లమెంటులో అలజడి సృష్టించిన నిందితులకు దిల్లీ కోర్టు పోలీస్‌ కస్టడీని పొడిగించింది.

Updated : 21 Dec 2023 17:22 IST

Parliament Security Breach | దిల్లీ: పార్లమెంటు భవనంలో అలజడి ఘటనలో నిందితులను పోలీసులు గురువారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో నలుగురు నిందితులకు పటియాలా హౌస్‌ కోర్టు తొలుత ఏడు రోజుల కస్టడీ విధించగా..  ఆ గడువు నేటితో ముగిసింది. దీంతో మరోసారి పోలీసులు నిందితులను ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. పార్లమెంటులో అలజడి సృష్టించిన కేసులో అరెస్టయిన మనోరంజన్‌ డి, సాగర్‌ శర్మ, అమోల్‌ ధన్‌రాజ్‌ శిందే, నీలమ్‌దేవిలను 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని దిల్లీ పోలీసులు కోరారు.

లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు

పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ఈ నలుగురినీ జనవరి 5వరకు ( 15 రోజుల పాటు) పోలీస్‌ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు ఘటనలో నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) చట్టం కింద కేసులు నమోదైంది. నిందితుల చర్యలు 2001లో ఉగ్రవాడిని ప్రతిబింబిస్తున్నాయని.. వారి అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోనే దిశగా వివిధ కోణాల్లో దిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని