Viral news: బైక్‌పై దూసుకెళ్తూ ఆ యువతి ఏం చేసిందో చూడండి!

వేగంగా వెళ్తున్న బైక్‌పై ఓ యువతి రెండు గన్‌లు పట్టుకుంటూ రీల్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 21 Aug 2023 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రీల్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం ఈ మధ్య కాలంలో ఓ ట్రెండ్‌గా మారింది. దీని కోసం లేనిపోని సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొంతమంది యువత. కదులుతున్న రైలుకు ఎదురుగా నిలబడి, ఎత్తైన కొండ అంచుకువెళ్లి రీల్స్‌ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. తాజాగా బిహార్‌ రాజధాని పట్నాలో ఓ యువతి రెండు చేతుల్లో 2 గన్‌లను పట్టుకొని, వేగంగా వెళ్తున్న బైక్‌పై నిల్చొని స్టంట్‌ చేస్తూ, కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారడంలో పోలీసులు స్పందించారు. బైక్‌తో నిందితుల కోసం గాలిస్తున్నట్లు పట్నా ఎస్పీ వైభవ్‌ శర్మ తెలిపారు. ఇదే తరహా ఘటన ఈ ప్రాంతంలోనే కొన్ని నెలల కిందట కూడా జరిగింది. బైక్‌పై వెళ్తూ ఓ యువతి గన్‌ చూపిస్తూ ఫోజులిచ్చింది. అయితే, దర్యాప్తులో అది తుపాకీ కాదని లైటర్‌ అని తేలింది. ఈ కేసులో ఆమెకు రూ.34వేల జరిమానా విధించడంతోపాటు, బైక్‌ రిజిస్ట్రేషన్‌ను ఏడాదిపాటు రద్దు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని