ఇక తెరముందుకు వీకే పాండియన్‌.. బీజేడీలో చేరిన మాజీ ఐఏఎస్‌

మాజీ ఐఏఎస్‌ వీకే పాండియన్‌(VK Pandian).. ఒడిశా రాజకీయాల్లోకి ఎంటర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసంలో అధికార బీజేడీలో చేరారు. 

Updated : 27 Nov 2023 14:11 IST

భువనేశ్వర్‌: ఎన్నికలకు కొద్దినెలల ముందు ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.  తెర వెనుక ఉంటూ అన్నీ తానై వ్యవహరించిన వీకే పాండియన్(VK Pandian) తాజాగా తెర ముందుకు వచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదళ్‌(BJD) పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్నాయక్(Naveen Patnaik) సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.

2000 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌కు చెందిన వీకే పాండియన్‌.. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఒడిశా ప్రభుత్వం ఆయన్ను 5టీ, నవీన్‌ ఒడిశా అధ్యక్షునిగా నియమించింది. క్యాబినెట్‌ హోదా కల్పిస్తూ సాధారణ పాలనా విభాగం ఉత్వర్వులు జారీ చేసింది. దాంతో పాండియన్.. పట్నాయక్‌ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు. దసరా సెలవుల్లో జరిగిన ఈ అనూహ్య పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ.. తాజాగా ఆయన బీజేడీలో చేరారు. ఆయన తమిళనాడు వాసి.

ఎన్నికలకు మరికొద్ది నెలలు మిగిలుండగా పాండియన్ సూపర్‌ సీఎంగా వ్యవహరిస్తారన్న వ్యాఖ్యలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. పాలనను, పార్టీని నియంత్రిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందుగా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో మార్పులు, చేర్పులు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని