Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. భయంతో కిందకు దూకేసిన ప్రజలు

అగ్నిప్రమాదం నుంచి తమను తాను రక్షించుకునేందుకు కొందరు వ్యక్తులు పైఅంతస్తు నుంచి దూకేశారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిందీ ఘటన.

Published : 19 Jun 2023 18:09 IST

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh )లోని కోర్బా జిల్లాలో సోమవారం ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌ ప్రాంతంలోని ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు భవనమంతా వ్యాపించాయి. దీంతో అందులో చిక్కుకున్న ప్రజలు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. ప్రమాదం నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేశారు.

భారీగా ఎగిసిపడుతున్న మంటల పక్కనుంచి వారు కిందకు దూకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video)గా మారాయి. ఈ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో వస్త్రదుకాణం, ఇండియన్‌ బ్యాంక్‌తో పాటు పలు దుకాణాలున్నాయి. ఇవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.

బ్యాంక్‌లో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇతర దుకాణాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఆస్తినష్టం భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని