Republic Day: దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు.. అమర జవానులకు నివాళి
ప్రధాని మోదీ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ(Republic Day) శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ రోజు కోసం గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను సిద్ధం చేసింది.
దిల్లీ: దేశం 74వ గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలు నిర్వహిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ(Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేశ ప్రజలకు గణంతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సారి ఈ వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ.. వీటిని నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం’ అని ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద ప్రధాని అమర జవాన్లకు నివాళి అర్పించారు.
గూగుల్ స్పెషల్ డూడుల్..
ప్రముఖ టెక్ సంస్థ గూగుల్(Google) ఈ రోజున ప్రత్యేక డూడుల్‌ను సిద్ధం చేసింది. గూగుల్ స్పెల్లింగ్‌లోని g,o,g,l,eని లోయర్ కేస్‌లో రాసి, ఇంకో o స్థానంలో రాష్ట్రపతి భవనం డోమ్ ప్రతిబింబించేలా తీర్చిదిద్దింది. దీనిని గుజరాత్‌కు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ పార్థ్ కొథేకర్ తీర్చిదిద్దారు. ఈ ఆర్ట్ వర్క్‌లో రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ వంటి ప్రముఖ నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Ts-top-news News
తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
India News
Kejriwal: దిల్లీని గెలవాలనుకుంటే..! మోదీకి కేజ్రీవాల్ ఇచ్చిన సలహా
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/03/2023)
-
Sports News
భిన్నమైన మేళవింపులు ప్రయత్నిస్తున్నాం.. కోచ్ రాహుల్ ద్రవిడ్
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు