PM Modi: గేమర్లతో మోదీ ‘ఆన్‌లైన్‌ గేమ్‌’.. వైరల్‌ వీడియో చూశారా..?

PM Modi: వీడియో గేమర్లతో కలిసి ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Published : 11 Apr 2024 17:25 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ వీడియో గేమ్స్‌తో పాపులారిటీ సంపాదించిన కొంతమంది గేమర్ల (gamers)తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ముచ్చటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గేమర్లు తీర్థ్‌ మెహతా, పాయల్‌ ధరీ, అనిమేశ్‌ అగర్వాల్‌, అన్షు బిష్త్‌, నమన్‌ మథుర్‌, మిథిలేశ్‌ పటాంకర్‌, గణేశ్ గంగాధర్‌ ఇటీవల ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈసందర్భంగా గేమింగ్‌ పరిశ్రమపై చర్చించిన మోదీ వారితో కలిసి కొంతసేపు పీసీ, వీఆర్‌ గేమ్స్‌ ఆడారు.

ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను భాజపా నేత అమిత్‌ మాలవీయ సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘‘గేమింగ్‌ పరిశ్రమ (Gaming Industry)లో వినూత్నంగా వస్తున్న పరిణామాలు, గేమర్ల సృజనాత్మకతను మోదీ ప్రభుత్వం ఎలా గుర్తించింది అన్న అంశాలపై ప్రధాని వారితో ముచ్చటించారు. గేమింగ్స్‌, గ్యాంబ్లింగ్‌ సమస్యలు, ఈ రంగంలో మహిళల భాగస్వామ్యంపై కూడా మోదీ చర్చించారు’’ అని మాలవీయ రాసుకొచ్చారు. పూర్తి వీడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ వీడియోలో ప్రధాని మోదీ గేమర్లతో కలిసి వీఆర్‌ సెట్‌ ధరించి కొంతసేపు గేమ్స్‌ ఆడారు. వారికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. ప్రధానిని కలవడం తమకు చాలా గర్వంగా ఉందని గేమర్లు ఆనందం వ్యక్తంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు