Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ
జపాన్ ప్రధాని కిషిద (Fumio Kishida)తో కలిసి ప్రధాని మోదీ (Modi) పానీపూరీ (Pani puri)ని ఆరగించారు. ఈ రుచిని ఇష్టపడిన కిషిద మరోటి కావాలంటూ అడిగి మరీ తిన్నారు.
దిల్లీ: భారత పర్యటనకు వచ్చిన జపాన్ (Japan) ప్రధానమంత్రి ఫుమియో కిషిద (Fumio Kishida)కు మన దేశ వంటకాలను రుచి చూపించారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi). ప్రత్యేకంగా భారత్‌లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరీ (గోల్గప్ప)ని ఆయనకు తినిపించారు. మన పానీపూరీ (Pani puri) రుచి జపాన్ ప్రధానికి ఎంతగానో నచ్చేసిందట.
భారత్ (India), జపాన్ (Japan) మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు గానూ ఇరు దేశాల ప్రధానులు సోమవారం దిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌ను సందర్శించారు. ఉద్యానవనమంతా కలియదిరుగుతూ వీరిద్దరూ ముచ్చటించారు. అనంతరం అక్కడి ఫుడ్ స్టాళ్ల వద్దకు వెళ్లి భారతీయ అల్పాహార వంటకాలను, పానీయాలను రుచిచూశారు. ఇరు దేశాల ప్రధానులు కవ్వంతో మజ్జిక చిలికారు. ఆ తర్వాత కిషిదకు ప్రధాని మోదీ పానీపూరీ (Pani Puri) గురించి చెప్పి దాని రుచి చూపించారు. ఆ రుచిని ఇష్టపడ్డ జపాన్ ప్రధాని ఇంకోటి కావాలని అడిగారు. పానీపూరీ (Golgappa)తో పాటు ఫ్రైడ్ ఇడ్లీ, మామిడితో చేసిన షర్బత్‌ను కిషిద రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా జపాన్ ప్రధాని కిషిదకు ప్రధాని ప్రత్యేక కానుకలను అందించారు. చందనపు చెక్కపై చెక్కిన బుద్ధుని ప్రతిమను బహూకరించారు. బాల్బోధి మొక్కను కూడా కిషిదకు మోదీ కానుకగా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం