PM Modi: అర్ధరాత్రి వేళ.. వారణాసి రోడ్డును తనిఖీ చేసిన మోదీ

PM Modi: అర్ధరాత్రి వేళ ప్రధాని మోదీ వారణాసిలో కొత్తగా నిర్మించిన రహదారి మార్గాన్ని తనిఖీ చేశారు. ఆ దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Published : 23 Feb 2024 13:11 IST

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి తన సొంత నియోజకవర్గం వారణాసి (Varanasi) చేరుకున్న ఆయన.. వచ్చీ రాగానే స్థానికంగా ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మించిన శివ్‌పుర్‌- ఫుల్‌వరియా - లహ్‌రతారా మార్గ్‌ను అర్ధరాత్రి వేళ తనిఖీ చేశారు. ఆయన వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

రూ.360కోట్లతో నిర్మించిన ఈ మార్గ్‌ను ఇటీవలే ప్రారంభించారు. దీని వల్ల దక్షిణ వారణాసి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గాయని మోదీ తెలిపారు. ఈ రహదారి మార్గంతో బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయం దాదాపు సగం తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీలకు ముందు వారణాసి వీధుల్లో మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. రాత్రి వేళ అయినప్పటికీ.. ఆయనను చూసేందుకు ప్రజలు రహదారుల వెంట బారులు తీరారు. ప్రధానిపై పూలవర్షం కురిపించారు.

పర్యటనలో భాగంగా వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. బనారస్‌ హిందూ యూనివర్సిటీలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. సంత్‌ గురు రవిదాస్‌ జన్మస్థలిని దర్శించుకున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని