Modi: ‘వాడీవేడీ చర్చలో ఉన్నా.. నవ్వులు పూయించగలరు’: వాజ్‌పేయీ జయంతి వేళ మోదీ నివాళి

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ(Modi) నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. 

Published : 25 Dec 2023 11:34 IST

దిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ(Atal Bihari Vajpayee) 99వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu), ప్రధాని నరేంద్రమోదీ(Modi) నివాళులు అర్పించారు. సోమవారం దిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్‌ అటల్‌ను సందర్శించారు. మాతృభూమి పట్ల వాజ్‌పేయీ చూపిన అంకితభావం భవిష్యత్తు తరాలకు స్పూర్తి  అని మోదీ కొనియాడారు. ఈ దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

అలాగే వాజ్‌పేయీ జీవితంలోని వివిధ ఘట్టాల సమాహారంగా ఉన్న వీడియోను మోదీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోకు మోదీ గళం అందించారు. ‘దేనిలోనైనా హాస్యాన్ని వెతకగల సామర్థ్యం వాజ్‌పేయీ సొంతం. పార్టీ సమావేశాల్లో వాతావారణం వేడెక్కుతున్న సమయంలో.. ఒక జోక్‌ పేల్చి నవ్వులు పూయించేవారు. ఆయనకు ప్రతి విషయంపై అవగాహన ఉండేది’ అని మోదీ ప్రశంసించారు.

క్రీస్తు బోధనలను స్మరించుకుందాం: మోదీ

క్రిస్మస్ పర్వదినం రోజు దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ‘క్రిస్మస్‌కు చిహ్నాలైన దయ, కరుణను గుర్తుచేస్తుకుందాం. ఈ రోజున క్రీస్తు బోధనలను స్మరించుకుందాం’ అని మోదీ తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని