PM Modi: రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగడంపై ప్రధాని మోదీ స్పందించారు. సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు.

Published : 19 May 2024 16:45 IST

జంషెడ్‌పూర్‌: కాంగ్రెస్‌ కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీకి దిగడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. తన కుమారుడి కోసం ఆ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగిన సోనియా గాంధీ (Sonia Gandhi)పై విమర్శలు గుప్పించారు.

ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘సోనియా గాంధీ రాయ్‌బరేలీని వదిలి వెళ్లిపోయారు. కొవిడ్‌ తర్వాత ఆమె తన నియోజకవర్గాన్ని ఒక్కసారి కూడా సందర్శించలేదు. ప్రస్తుతం తన కుమారుడిని రాయ్‌బరేలీ ప్రజల చేతుల్లో పెడుతున్నానంటూ.. ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ పోటీలో దింపడానికి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ అభివృద్ధి కోసం పని చేసిన ఒక్క కార్యకర్త కూడా మీకు కనిపించలేదా? వారంతా (గాంధీ కుటుంబం) ఈ స్థానాన్ని తమ కుటుంబ ఆస్తిగా భావిస్తున్నారు’’ అని మోదీ విమర్శలు గుప్పించారు.

ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్‌ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..

వాటికి వీలునామా రాస్తున్నారు..

వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ.. ఆ తర్వాత రాయ్‌బరేలీ నుంచి సిద్ధమవ్వడంపై ప్రధాని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ యువరాజ్‌ (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) వయనాడ్‌ నుంచి ఇప్పుడు రాయ్‌బరేలీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. ‘‘స్కూలుకు వెళ్లే ఎనిమిదేళ్ల పిల్లాడు.. తన తండ్రి అక్కడ చదువుకున్నప్పటికీ.. అలా చెప్పుకోడు. రాయ్‌బరేలీ వెళ్లిన రాహుల్‌ మాత్రం ఇది తన తల్లిది అని చెబుతూ తిరుగుతున్నారు. ఈ కుటుంబ నేపథ్యం ఉన్నవారు ఎంపీ స్థానాలకు వీలునామా రాస్తున్నారు. ఇలాంటి కుటుంబ పార్టీల నుంచి ఝార్ఖండ్‌ను కాపాడాలి’’ అని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని