PM Modi: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. ప్రముఖుల సందడి

ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు విచ్చేశారు.

Updated : 09 Jun 2024 21:19 IST

దిల్లీ: భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ  ప్రమాణస్వీకారోత్సవంలో ప్రముఖులు సందడి చేశారు. రాష్ట్రపతి భవన్‌ వద్ద వైభవంగా జరుగుతున్న ఈ వేడుకకు  సార్క్‌ సభ్యదేశాల ప్రతినిధులు, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల అధినేతలతో పాటు దేశ నలుమూలల నుంచి పలువురు రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాలు తరలివచ్చారు. మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి విచ్చేసిన విదేశీ ప్రముఖుల్లో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె, నేపాల్‌ ప్రధాని ప్రచండ, మారిసస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌, బూటాన్‌ ప్రధాని షెరింగ్ టోబ్గే సహా పలువురు నేతలు ప్రత్యేక అతిథులు విచ్చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం హాజరయ్యారు. 

ఈ వేడుకలో ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్కడ్‌, సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు, సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, సినీనటులు షారుక్‌ ఖాన్‌, రజనీకాంత్‌తో పాటు భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీ, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ, ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని