PM Modi: ఆప్యాయంగా పలకరిస్తూ.. నవ్వులు చిందిస్తూ.. విపక్ష నేతలతో ప్రధాని మోదీ ముచ్చట్లు

జి-20 సదస్సు ఏర్పాట్లపై ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమయంలో విపక్ష నేతలను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరిస్తూ, నవ్వుతూ ముచ్చటించారు.

Published : 06 Dec 2022 16:54 IST

దిల్లీ: ప్రతిష్ఠాత్మక జీ-20 దేశాల సదస్సును (G20 Summit) ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించేందుకుగానూ ప్రధాని మోదీ (Narendra Modi) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి జాతీయ పార్టీల ముఖ్యనేతలతోపాటు వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఆ సమయంలో విపక్షపార్టీల నేతలను (Opposition Leaders) ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఒక్కొక్కరికి నమస్కరిస్తూ.. వారితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించారు. నిత్యం ప్రధాని మోదీపై విరుచుకుపడే ప్రధాన విపక్ష నేతలు కూడా ఎంతో ఆప్యాయంగా మోదీతో సంభాషించినట్లు కనిపిస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌, మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగాలను ప్రధాని మోదీ పలకరించారు. వీరితోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా, జేడీఎస్‌ అధ్యక్షుడు దేవెగౌడ, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడులతో మాట్లాడుతూ నవ్వులు చిందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు