PM Modi: మంచి ప్లాన్‌తో రండి.. మంత్రులకు మోదీ సూచన

కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 100 రోజుల కార్యాచరణపై కసరత్తు చేయాలని ప్రధాని మోదీ మంత్రిత్వ శాఖలకు సూచించారు. 

Published : 24 Feb 2024 17:54 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేతృత్వంలో మార్చి 3న కేంద్ర మంత్రిమండలి సమావేశం కానుంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మంత్రులకు మోదీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. రాబోయే 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేయాలని వారిని కోరినట్లు తెలుస్తోంది.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఉండే వ్యవధికి సంబంధించిన అజెండాపై కసరత్తు చేయాలని మంత్రులు, మంత్రిత్వశాఖలకు ఆయన సూచించారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో మోదీ కోరినట్లు తాజా సమాచారం. అమలు చేయగల, అంచనా వేయగల, స్పష్టమైన నిర్వచణతో కూడిన ప్రణాళికను త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టాల్సిందిగా కోరారు. అందుకోసం సీనియర్‌ బ్యూరోక్రాట్‌, డొమైన్‌ నిపుణులతో సహా కిందిస్థాయిలో పని చేసే వారితోనూ విస్తృతంగా సంప్రదింపులు జరపాలన్నారు.

‘మీ ఇంట్లో గొడవైతే.. నన్ను అనొద్దు’.. మహిళలతో ప్రధాని సరదా సంభాషణ

ఎన్నికలు సమీపించే సమయంలోనూ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించేలా చూడడమే ఆయన ఉద్దేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికలో మూడోసారి కూడా భాజపా అధికారం చేజిక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలోభాగంగా 15 లక్షల మందికి పైగా ప్రజల నుంచి సలహాలు స్వీకరించినట్లు మోదీ ఇటీవల తెలిపారు. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ మార్చి 9 తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు