Kunal Kamra: పోలీసులు మా సహనాన్ని పరీక్షించొద్దు.. కామ్రాను అరెస్టు చేయండి: మహారాష్ట్ర మంత్రి

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde)పై స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా (Kunal Kamra) ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కామ్రాను వెంటనే అరెస్టు చేయాలని, శివసేన శ్రేణుల సహనాన్ని పరీక్షించొద్దని పోలీసులను ఉద్దేశించి పార్టీ నేత, మంత్రి శంభురాజ్ దేశాయ్ వ్యాఖ్యానించారు.
‘‘శిందే మమ్మల్ని సంయమనం పాటించమని కోరారు. అందుకే మౌనంగా ఉన్నాం. కామ్రా ఎక్కడ దాక్కున్నా ఎలా బయటకు తీసుకురావాలో శివసేన కార్యకర్తలుగా మాకు తెలుసు. కానీ.. మంత్రులుగా మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. పోలీసులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఎక్కడ ఉన్నా అతడిని పట్టుకోండి. ‘ప్రసాదం’ పెట్టండి’’ అని మీడియా ముందు మంత్రి దేశాయ్ మాట్లాడారు.
ఇటీవల ముంబయిలో కునాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శిందేను ‘‘గద్దార్’’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణం చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమ వేదికపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు.
ఈ పరిణామాలపై శిందే ఇప్పటికే స్పందించారు. ‘‘ఇలాంటి పనులు చేయడానికి ఆయన (కునాల్) ఎవరి నుంచో సుపారీ తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ముఖ్యం. కానీ వేరే వారి తరఫున ఇతరుల గురించి తప్పుగా మాట్లాడటం సరికాదు. నా గురించి మర్చిపోండి.. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి, హోం మంత్రి గురించి ఏం మాట్లాడారో చూడండి. అలాగే నేను విధ్వంసాన్ని సమర్థించను’’ అని శిందే అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


