Prem Singh Tamang: సిక్కిం సీఎంగా ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ ప్రమాణం

హిమాలయ రాష్ట్రం సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ (56) వరుసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Published : 11 Jun 2024 05:07 IST

గ్యాంగ్‌టక్‌: హిమాలయ రాష్ట్రం సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ (56) వరుసగా రెండోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్‌ స్టేడియంలో గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య సోమవారం ఆయనతో ప్రమాణం చేయించారు. మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఎస్‌కేఎం వాటిలో ఏకంగా 31 సీట్లు గెల్చుకోవడం ద్వారా ప్రభంజనం సృష్టించింది. సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తమాంగ్‌కు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని