PM Modi: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ 150వ జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

Eenadu icon
By National News Team Updated : 31 Oct 2025 10:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మాజీ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) నివాళులర్పించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని మోదీ (PM Modi) పటేల్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహంపై హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిసింది. అనంతరం ఏక్తా దివస్‌ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.

సైనిక దళాల నుంచి గౌరవవందనం స్వీకరించిన మోదీ.. అనంతరం వారికి సెల్యూట్‌ చేశారు. సాయుధ దళాలు, స్థానికులతో కలిపి ప్రధాని ఐక్యతా ప్రమాణం చేశారు. సైనిక బలగాల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌, జమ్మూకశ్మీర్‌, అండమాన్‌ నికోబార్‌, మణిపుర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags :
Published : 31 Oct 2025 09:23 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని