Cake: పదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన బర్త్‌డే కేక్‌..?

పుట్టిన రోజున ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ విషపూరితం కావడంతో పంజాబ్‌కు చెందిన 10 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Published : 31 Mar 2024 00:04 IST

పటియాలా: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ విషపూరితం కావడంతో పదేళ్ల చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బేకరీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్‌లైన్‌లో కేక్‌ ఆర్డర్‌ చేశారు. సాయంత్రం 7 గంటలకు కేక్‌ కట్‌ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు.

గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బేకరీ యజమానిపై ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్‌ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని