Ahmedabad: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు.. ఆప్ కార్యకర్తల అరెస్టు
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టర్లను విడుదల చేసినందుకు ఎనిమిది మంది ఆప్ కార్యకర్తలను అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అభ్యంతరకర పోస్టర్లను విడుదల చేసినందుకు అహ్మదాబాద్‌లో 8 మంది కార్యకర్తలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గురువారం అహ్మదాబాద్‌లోని ఆయా ప్రాంతాల్లో ఆప్ కార్యకర్తలు ‘మోదీ హటావో దేశ్ బచావో’అని రాసున్న పోస్టర్ల(posters)ను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 11 భాషల్లో ఈ పోస్టర్లను విడుదల చేయనున్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నందుకు నగర పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య సమరయోధులు పోస్టర్లు అంటించారని గుర్తు చేశారు.
గత వారం ప్రధానిని లక్ష్యంగా చేసుకుని వేలాది పోస్టర్లు దేశ రాజధాని గోడలపై దర్శనమిచ్చాయి. దీంతో 49 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అంతేకాకుండా ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన వ్యక్తులు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్