Raghav Chadha: రాఘవ్‌ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్‌.. ఎంపీ సమాధానమిదే..!

రాఘవ్‌ చద్దా(Raghav Chadha), పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్‌లో ఉన్నారంటూ పలు వార్తలు వస్తున్నాయి. దీనిపై చద్దా స్పందించారు. 

Published : 24 Mar 2023 23:05 IST

దిల్లీ: ఆమ్‌ఆద్మీపార్టీ(AAP) యువ ఎంపీ రాఘవ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra).. ఈ పేర్లు రెండురోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి . వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పార్లమెంట్‌ నుంచి బయటకు వస్తోన్న ఆయనపై  విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకు ఆయన అంతే కూల్‌గా సమాధానం చెప్పారు. ‘నన్ను రాజకీయాల (రాజనీతి) గురించి మాత్రమే ప్రశ్నించండి. పరిణీతి గురించి కాదు’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. 

పాత్రికేయులు: మీ మ్యారేజ్‌ ప్లాన్‌ ఏంటి..? 

చద్దా: నా పెళ్లి జరగ్గానే మీకు చెప్తాను.

పాత్రికేయులు: ఎందుకీ సస్పెన్స్‌..?

చద్దా: సస్పెన్స్‌ అంటూ ఏమీ లేదు. నా పెళ్లి జరగ్గానే మీకు తెలుస్తుంది. అదే విషయం మీకు చెప్తున్నా. ఈ సమాధానాలు ఇచ్చేప్పుడు ఆయన చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు. 

రాఘవ్‌ చద్దా(Raghav Chadha).. పార్లమెంట్‌లో అత్యంత పిన్నవయస్కుడైన ఎంపీ. ఆయన పంజాబ్‌ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరిణీతి బాలీవుడ్ నటి. ఆమె లేడీస్‌ వర్సెస్ రిక్కీ బహ్ల్‌తో సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. పరిణీతి ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కి జోడీగా ‘క్యాప్సూల్‌ గిల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వీరిద్దరికీ ఎప్పటినుంచో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. చదువుకునే రోజుల నుంచి వీరికి పరిచయం ఉందని పలు కథనాలు వచ్చాయి. రాఘవ్‌ చద్దా ట్విటర్‌లో 44 మంది అనుసరిస్తున్నారు. అందులో ఇద్దరు బాలీవుడ్‌కు చెందిన వారున్నారు. అందులో ఒకరు గుల్‌ పనాగ్‌. ఆమె ఆప్‌ సభ్యురాలు. మిగిలిన ఆ ఒక్కరు పరిణీతి(Parineeti Chopra)నే. ఇక ఈ వార్తలపై ఆమె నుంచి  ఎలాంటి స్పందనా రాలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు