Rahul Gandhi: ‘మోదీ.. సంపన్నులకు ఓ సాధనం’.. రాహుల్‌ విమర్శలు

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సంపన్నులకు ఓ సాధనంగా మారారని అభివర్ణించారు. 

Published : 16 Apr 2024 15:11 IST

కోజికోడ్‌: దేశంలోని కొంతమంది సంపన్న వ్యాపారవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఓ సాధనంగా మారారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. వారి బ్యాంకు రుణాలు మాఫీ చేశారంటూ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోజికోడ్‌లోని కొడియత్తూర్‌లో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న వేళ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘దేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ సాధనంగా మారారు. వారి రుణాలను మాఫీ చేయించారు. ఇప్పటి వరకు 20-25 మందికి దాదాపు రూ.16 లక్షల కోట్లు ఇచ్చారు. భారత్‌లో రైతు సమస్యలపై ఆయన అసలు మాట్లాడరు. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను ప్రస్తావించరు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఇది’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.

‘మీరేం అమాయకులు కాదు’.. పతంజలి కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

ఎన్నికల బాండ్ల విధానంపై స్పందించిన రాహుల్‌.. ఇవి ప్రధాని మోదీ దోపిడీకి రూపమన్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వయనాడ్‌ ఎంపీగా వ్యవహరిస్తున్న రాహుల్‌గాంధీ మళ్లీ అదే స్థానం నుంచి బరిలోకి దిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన 4,31,770 ఓట్లతో విజయం సాధించారు. 20 ఎంపీ స్థానాలున్న కేరళలో ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని