Rahul Gandhi: ఇవి ఎగ్జిట్ పోల్స్‌ కావు.. మోదీ పోల్స్‌: రాహుల్‌ గాంధీ

శనివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు ఈ విధమైన తప్పుడు సర్వేలు విడుదల చేస్తున్నారని విమర్శించారు.

Published : 02 Jun 2024 15:43 IST

దిల్లీ: కేంద్రంలో భాజపా రికార్డు స్థాయిలో మూడోసారి గెలుస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. ఇవి ఎగ్జిట్ పోల్స్ కావని.. మోదీ మీడియా పోల్స్ అని మండిపడ్డారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనేదానిపై చర్చించడానికి ఇండియా కూటమి(INDIA alliance) నేతలు శనివారం సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 295 సీట్లు సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కాగా శనివారం విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ కేంద్రంలో ఎన్డీఏ (NDA) కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. ఇండియా కూటమి ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు