Viral news: రూ.500 తీసుకొని..రూ.20గా చూపించి..రైల్వే ఉద్యోగి మోసం
రైల్వే టికెట్ బుకింగ్ క్లర్కు ఓ ప్రయాణికుణ్ని మోసం చేయాలని ప్రయత్నించాడు. కానీ, చివరికి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఎలాగో తెలుసా?
ఇంటర్నెట్‌డెస్క్: అతడు టికెట్ కౌంటర్‌లో పని చేసే ఓ రైల్వే ఉద్యోగి. అవసరమైతే ప్రయాణికులకు కొన్ని సూచనలు చేసి వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. కానీ, అతడు చేసిన పని అతడి మోసపు బుద్ధికి అద్దం పడుతోంది. దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్‌లో టికెట్ కోసం వచ్చిన ప్రయాణికుడు రూ.500 ఇచ్చి గ్వాలియర్ సూపర్‌ఫాస్ట్ రైలుకు టికెట్ ఇవ్వమని కోరగా.. ఆయన్ని మాటల్లో పెట్టి.. రూ.500 కాజేశాడు. తన వద్దనున్న రూ.20 నోటును బయటకి తీసి.. ఇది టికెట్‌కు సరిపోదని, మరో రూ.125 ఇవ్వాలని ప్రయాణికుణ్ని డిమాండ్ చేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ‘రైల్‌విష్పర్స్’ అనే ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది. రైల్వే ఉన్నతాధికారులతోపాటు, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కూడా ట్విటర్ ట్యాగ్ చేశారు. దీంతో రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. సంబంధిత టికెట్ బుకింగ్ క్లర్క్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
Shubman Gill: ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఫన్నీ వీడియో.. చూస్తే నవ్వు ఆగదు