Railway Unions: మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తాం.. రైల్వే సంఘాల హెచ్చరిక

పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించకపోతే అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని పలు రైల్వే సంఘాలు హెచ్చరించాయి.

Updated : 01 Mar 2024 17:42 IST

Railway unions | దిల్లీ: నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని పలు రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే మే 1 నుంచి దేశ వ్యాప్తంగా అన్ని రైళ్ల సర్వీసుల్ని నిలిపివేస్తామని హెచ్చరించాయి. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని.. అందువల్ల ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని జాయింట్‌ ఫోరం ఫర్‌ రెస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (JFROPS) కన్వీనర్‌ శివ్‌ గోపాల్‌ మిశ్రా తెలిపారు.

పలు రైల్వే సంఘాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌ సంయుక్త వేదికగా ఏర్పడ్డారు. ఈ వేదిక తరఫున వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధుల బృందం మార్చి 19న కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖను కలిసి సమ్మె అంశంపై అధికారికంగా నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు కన్వీనర్‌ వివరించారు. ఇతర ప్రభుత్వ సంఘాలు సైతం తమ పోరాటంలో భాగం కానున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.  కొత్త పింఛను విధానం ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని