viral video: రైలును నెట్టిన కార్మికులు... వైరలైన వీడియో

రైల్వే కార్మికులు రైలును నెడుతూ తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.   

Updated : 30 Mar 2024 14:29 IST

లఖ్‌నవూ: రైల్వే కార్మికులు ఒక బోగితో ఉన్న రైలును నెడుతూ తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, నిహాల్‌ఘఢ్ రైల్వేస్టేషన్‌ల సమీపంలో రైలు బ్రేకులు పనిచేయక ఆగిపోయింది. రైల్వే సిబ్బంది దాన్ని బాగు చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. పట్టాలపై రైలునిలిచిపోవడంతో మిగిలిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కార్మికులు దానిని మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్‌లోకి నెట్టాల్సి వచ్చింది.

వారు రైలు బోగిని నెట్టినంత సేపు రైల్వే గేటు మూసిఉండడంతో ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఓ ప్రయాణికుడు దీనికి సంబంధించిన వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఆ వీడియో వైరల్‌ అవడంతో ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎస్ శర్మ మాట్లాడుతూ అది ఒక బోగితో ఉన్న డీపీసీ రైలు అని, దానిపై రైల్వే అధికారులు కూర్చొని తనిఖీలు చేస్తారని తెలిపారు. సుల్తాన్‌పుర్‌ నుంచి అధికారులు లఖ్‌నవూ వైపు వెళ్తుండగా నిహాల్‌ఘఢ్ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆగిపోయిందని వివరించారు. బాగు చేయడానికి ప్రయత్నించినా కాకపోవడంతో రైలును లూప్‌లైన్‌లో నిలిపామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని