Ashok Gehlot: ఇంట్లో జారి పడ్డ రాజస్థాన్‌ సీఎం గహ్లోత్‌.. కాలి వేళ్లకు గాయాలు

ఇంట్లో జారి పడడంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ రెండు కాలి వేళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన వీల్‌ ఛైర్‌లో ఇంటికి చేరుకున్నారు. 

Updated : 30 Jun 2023 01:02 IST

జైపుర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌(Ashok Gehlot) పాదాలకు, రెండు కాలి వేళ్లకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఓ సమావేశంలో పాల్గొని జైపుర్‌లోని ఇంటికి చేరుకున్న ఆయన గదిలోకి వెళ్లే క్రమంలో జారి పడ్డారు. దీంతో ఆయన రెండు కాలి వేళ్లకు గాయాలు అయ్యాయి. ఒక కాలివేలు విరిగినట్టు సమాచారం. సిబ్బంది వెంటనే దగ్గర్లోని ఎస్‌ఎంఎస్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన అనంతరం వీల్‌ ఛైర్‌లో గహ్లోత్‌ ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. జారి పడడంతో కాలి వేళ్లకు గాయాలు అయ్యాయి. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండి విధులు నిర్వహిస్తాను అని తెలిపారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని