Rajnath Singh: ఇన్నేళ్లుగా ‘రాహుల్‌’యాన్‌ను లాంచ్‌ చేయలేకపోయింది: రాజ్‌నాథ్‌ సింగ్‌

అమేఠీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. 

Updated : 18 Apr 2024 15:09 IST

తిరువనంతపురం: ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీ (Amethi)లో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరు బరిలో దిగనున్నారో ఇంకా ఆ పార్టీ నిర్ణయించలేదు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) హస్తం పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై విమర్శలు గుప్పించారు. అమేఠీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్‌కు ధైర్యం లేదంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలోని పతనంతిట్టలో భాజపా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘2019లో జరిగిన ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్‌ పరాజయం పాలయ్యారు. అందుకే ఈసారి అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ ప్రభావంతో ఉత్తరప్రదేశ్‌ నుంచి కేరళకు కాంగ్రెస్‌ నేత వలస వచ్చారు. వయనాడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ను మరోసారి తమ ఎంపీగా ఎన్నుకోవద్దని అక్కడి ప్రజలు భావిస్తున్నట్లు విన్నాను’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు. 

ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్‌

అమేఠీ నుంచి రాహుల్‌ పోటీ చేయాలి: అమిత్‌ షా

భారత్‌లో ఎన్నో కొత్త అంతరిక్ష ప్రయోగాలు, ఇతర ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు ప్రయోగిస్తున్నా.. హస్తం పార్టీ తమ యువనేత ‘రాహుల్‌యాన్‌’ను గత 20 ఏళ్లుగా లాంచ్‌ చేయలేకపోతోంది అంటూ రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోవైపు అమేఠీ నుంచి రాహుల్‌ గాంధీ పోటీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) స్పందించారు. ఆ స్థానం నుంచి రాహుల్‌ పోటీ చేయాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అమేఠీ నుంచి ఆయన ఎందుకు పోటీ చేయలేకపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రాహుల్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని