Parliament: పట్టు వీడని విపక్షాలు.. ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టడంతో ఉభయసభలు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడ్డాయి. 

Updated : 15 Dec 2023 11:51 IST

దిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ అనంతరం వాయిదా పడిన ఉభయ సభలు శుక్రవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి ప్రకటనకు పట్టు బడుతూ.. మరోసారి విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టడంతో లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు కూడా ఇదే అంశంపై చర్చకు డిమాండ్‌ చేయడంతో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లను తన ఛాంబర్‌లో సమావేశానికి ఆహ్వానించారు. ఉభయ సభల ప్రారంభానికి ముందు ఇండియా కూటమి ఎంపీలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే గురువారం సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరనస వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని