Ranveer Singh: డీప్‌ఫేక్ వీడియోపై రణ్‌వీర్‌ సింగ్‌ పోలీస్ కేసు

తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్‌ఫేక్ వీడియోపై బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Published : 22 Apr 2024 15:29 IST

ముంబయి: తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్‌ఫేక్ వీడియోపై బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రణ్‌వీర్‌ సహాయకులు ఈ విషయాన్ని తెలియజేస్తూ డీప్‌ఫేక్ వీడియోను ప్రచారం చేస్తున్న ఖాతాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఎన్నికల సమయంలో పలువురు నటులు పార్టీలకు ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్ ఫేక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇటీవల రణ్‌వీర్‌ వారణాసి పర్యటనలో భాగంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను ఏఐ ద్వారా మార్ఫింగ్‌ చేసి, ఆయన ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టు రూపొందించారు. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన రణ్‌వీర్‌ అది నిజం కాదని, ఫేక్‌ వీడియో అని తెలిపారు. డీప్‌ఫేక్‌ వీడియోలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.

ఇటీవల మరో బాలీవుడ్‌ నటుడు అమిర్‌ఖాన్‌ డీప్‌ఫేక్‌ బారిన పడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని