Viral news: పోలీసులు కళ్లుగప్పి.. జైలు గోడపై నుంచి దూకేసి.. చివరికి!

ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కళ్లుగప్పి.. 40 అడుగుల ఎత్తైన జైలు గోడపై నుంచి దూకేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Published : 28 Aug 2023 15:50 IST

బెంగళూరు: అత్యాచారం కేసులో విచారణ ఖైదీగా ఉన్న ఓ నిందితుడు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవాలనుకున్నాడు. పక్కా ప్రణాళిక ప్రకారం జైలు చుట్టూ నిర్మించిన 40 అడుగుల ఎత్తైన గోడ నుంచి కిందికి దూకేశాడు. దీంతో అతడి కాలి ఎముక విరిగిపోయింది. బాధతోనే అలా కుంటుకుంటూ.. అటువైపుగా వస్తున్న ఆటో ఎక్కి పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగిరె కారాగారంలో శుక్రవారం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అయితే, ఒక్క రోజు వ్యవధిలోనే నిందితుడిని మళ్లీ అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. నిందితుడు తప్పించుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని