Rinky Chakma: క్యాన్సర్‌తో 29 ఏళ్ల అందాల సుందరి మృతి

మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న రింకీ చక్మా(Rinky Chakma) క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 29 Feb 2024 10:58 IST

దిల్లీ: అందాల సుందరి రింకీ చక్మా(Rinky Chakma) క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆమె వయసు 29 ఏళ్లు. రెండేళ్ల నుంచి ఈ వ్యాధితో బాధపడుతోన్న ఆమె.. మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.  త్రిపురకు చెందిన రింకీ.. 2017లో మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు.

2022లో బ్రెస్ట్‌ క్యాన్సర్ బారినపడిన అనంతరం ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. అయితే వ్యాధి ఊపిరితిత్తులు, తలకు వ్యాపించింది. అప్పటి నుంచి చికిత్స అందినా, ప్రయోజనం లేకపోయింది. ఫిబ్రవరి 22న ఒక్కసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్నేహితులు, అందాల పోటీ సహచరులు నిధులు సేకరించారు. ఎప్పుడూ అనారోగ్యం గురించి బయటపెట్టని రింకీ(Rinky Chakma).. కొద్దివారాల క్రితం సుదీర్ఘపోస్టు పెట్టి, ఆర్థిక సహాయం అడిగారు. చివరకు కొద్దిగంటల  క్రితం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మిస్‌ఇండియా ఆర్గనైజేషన్‌ ధ్రువీకరించింది.

2017లో అందాల పోటీల్లో పాల్గొన్న రింకీ.. మిస్‌ బ్యూటీ విత్ పర్పస్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. ఆ ఏడాది హరియాణాకు చెందిన మానుషి చిల్లర్‌ మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని