S-400: భారత్‌కు ఎస్‌-400 డెలివరీలు ఇప్పట్లో లేనట్లే..!

భారత్‌కు ఎస్‌ 400 రక్షణ వ్యవస్థ డెలివరీలు ఇప్పట్లో లేనట్లే. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఈ జాప్యం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని భారత వర్గాలకు రష్యా ఇప్పటికే వెల్లడించింది. 

Updated : 21 Mar 2024 13:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400లను భారత్‌కు అందజేయడంలో మరింత జాప్యం చోటు చేసుకొంటుందని రష్యా (Russia) చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2024 తొలి అర్ధభాగంలోనే మొత్తం ఐదు వ్యవస్థలనూ అందజేయాల్సి ఉంది. ఉక్రెయిన్‌తో సుదీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధమే జాప్యానికి కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు అందాల్సిన రెండు వ్యవస్థలను 2026 మూడో త్రైమాసికం నాటికి అందజేస్తామని హామీ ఇచ్చినట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. 

ఈ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని యుద్ధ విమానాలు, క్రూజ్‌ క్షిపణలను ధ్వంసం చేయగలవు. భారత్‌ 2018లో ఐదు ఆర్డర్‌ చేయగా.. ఇప్పటి వరకు  మూడు రెజిమెంట్ల ఎస్‌-400లు చేరుకొన్నాయి. ఈ డీల్‌ విలువ రూ.35 వేల కోట్లు. వీటిని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వినియోగిస్తోంది. 

అరుణాచల్‌ భారత్‌దే.. చైనాకు తేల్చిచెప్పిన అగ్రరాజ్యం

పాక్, చైనా సరిహద్దుల్లో 1.5 రెజిమెంట్ల చొప్పున మోహరించారు. వీటితోపాటు భారత్‌ దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థల కోసం కూడా ప్రయత్నాలు చేపట్టింది. వీటిల్లో ఆకాశ్‌, స్పైడర్‌ క్షిపణి వ్యవస్థలు కూడా ఉన్నాయి. అవి రెండూ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని