Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ.. ప్రధాని మోదీ ఫోన్‌

ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ జరిగిన శస్త్రచికిత్స వివరాలను అపోలో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

Updated : 20 Mar 2024 23:39 IST

దిల్లీ: ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని దిల్లీ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స వివరాలను న్యూరాలజిస్ట్‌ వినిత్‌ సూరి ట్విటర్‌ ద్వారా బుధవారం వెల్లడించారు. ‘‘గత నాలుగు వారాలుగా సద్గురు తలనొప్పితో బాధపడుతున్నారు. అయినా, మహాశివరాత్రి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్చి 15 తర్వాత తలనొప్పి మరింత తీవ్రమైంది. ఆదివారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు. వైద్యపరీక్షలు నిర్వహించి మెదడులో రక్తస్రావం జరిగిందని గుర్తించాం. మా వైద్య బృందం వెంటనే శస్త్ర చికిత్స చేసింది. ఊహించిన దానికంటే త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఆయన సాధారణ జీవితం గడుపుతారు’’ అని వివరించారు.

జగ్గీ వాసుదేవ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ

ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న జగ్గీ వాసుదేవ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్‌ చేశారు. ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని తన ‘ఎక్స్‌’ ఖాతాలో వెల్లడించారు. జగ్గీవాసుదేవ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టు పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని