Rajiv Gandhi: రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషి మృతి..

భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన దోషి శాంతన్‌ గుండెపోటుతో మృతి చెందాడు.

Updated : 28 Feb 2024 11:10 IST

చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో జీవిత ఖైదును అనుభవించిన దోషుల్లో ఒకడైన శాంతన్‌ (Santhan)(55) మృతి చెందాడు. అనారోగ్యంతో తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

 శాంతన్‌ అలియాస్‌ సుతేంద్రరాజా శ్రీలంకకు చెందిన వ్యక్తి. తిరుచిరాపల్లిలోని ప్రత్యేక శిబిరంలో ఉంటున్న అతడు లివర్‌ ఫెయిల్యూర్‌ కారణంగా రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యాడు. శాంతన్‌ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం 7.30 గంటలకు అతడు మృతి చెందినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శ్రీలంకకు తరలించేందుకు చట్టపరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు.

దేశంలోనే వృద్ధ ఎంపీ షఫీకుర్రహ్మాన్‌ బర్క్‌ కన్నుమూత

1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్‌ గాంధీపై థను అనే ఎల్‌టీటీఈ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ దుర్ఘటనలో రాజీవ్‌ గాంధీతో పాటు 14 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేలుస్తూ  కోర్టు మరణశిక్ష విధించింది. దోషుల్లో శాంతన్‌ కూడా ఒకడు. 2014లో పేరరివాళన్‌తో పాటు శాంతన్‌, మురుగన్‌ మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించింది. 2022లో శాంతన్‌ను సుప్రీంకోర్టు విడుదల చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని