దేశంలోనే వృద్ధ ఎంపీ షఫీకుర్రహ్మాన్‌ బర్క్‌ కన్నుమూత

పార్లమెంటులో అత్యంత వృద్ధ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ నేత షఫీకుర్రహ్మాన్‌ బర్క్‌ (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

Published : 28 Feb 2024 05:17 IST

లఖ్‌నవూ: పార్లమెంటులో అత్యంత వృద్ధ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ నేత షఫీకుర్రహ్మాన్‌ బర్క్‌ (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ లోక్‌సభ నియోజకవర్గానికి బర్క్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంభల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొరాదాబాద్‌ ఎంపీగా మూడుసార్లు పనిచేశాక.. సంభల్‌ ఎంపీగా 2019లో రెండోసారి గెలుపొందారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ స్థానం నుంచి ఆయన్నే బరిలోకి దించాలని ఎస్పీ ఇటీవలే నిర్ణయించింది. సీనియర్‌ నేత మృతి పట్ల సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సంతాపం తెలియజేశారు. బర్క్‌ ‘వందేమాతరం’ వంటి అంశాలపై గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తాలిబన్లను స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చిన ఘటనలో కేసు కూడా నమోదయింది. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని సమర్థిస్తూ బర్క్‌ వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని