Udhayanidhi Stalin: మీరొక మంత్రి.. ఆ మాత్రం తెలియదా?: ఉదయనిధి ‘సనాతన’ వ్యాఖ్యలపై సుప్రీం

Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా చేయడం సరికాదని తీవ్రంగా మందలించింది.

Published : 04 Mar 2024 13:21 IST

దిల్లీ: సనాతన ధర్మాన్ని (Sanatan Dharma) నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపాయి. దీనికి గానూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది.

‘‘వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.

లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీం

గతేడాది సెప్టెంబరులో తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని (sanatana dharma) నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దాన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు