Asaram: శిక్ష నిలుపుదల కుదరదు.. ఆశారాం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

Asaram: వివాదాస్పద స్వామీజీ ఆశారాం యావజ్జీవ శిక్షను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Updated : 01 Mar 2024 13:27 IST

దిల్లీ: అత్యాచార కేసు (Rape Case)లో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. తన ఆరోగ్యం క్షీణిస్తున్న కారణంగా శిక్షను నిలిపివేయాలని కోరుతూ అతడు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.

ఆశారాం పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మహారాష్ట్రలో పోలీసు కస్టడీలో చికిత్స తీసుకునేందుకు అనుమతించాలని అతడి తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. దీనికి ధర్మాసం స్పందిస్తూ.. ఈ విషయంపైనా రాజస్థాన్‌ హైకోర్టులోనే పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. దీనిపై విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆదేశించింది.

‘ఆరు నెలల తర్వాత స్టే ఉత్తర్వులు వాటంతట అవే రద్దు కావు’

జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆశారాంను 2013లో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసు కస్టడీలో ఉండగా.. 2018లో పోక్సో కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. సూరత్‌లోని ఆశ్రమంలో మరో మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులోనూ అతడికి యావజ్జీవ శిక్ష పడింది. గతంలో ఆశారాం బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని