Supreme Court: అది ఓటర్ కచ్చితమైన హక్కేమీ కాదు: సుప్రీంకోర్టు

ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు ఉందని తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. 

Published : 09 Apr 2024 16:56 IST

దిల్లీ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రతి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. ఆ సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న ‘కచ్చితమైన’ హక్కేమీ కాదని వ్యాఖ్యానించింది. ‘‘అత్యంత విలువైన ఆస్తులు ఉండి, విలాసవంతమైన జీవన శైలిని ప్రతిబింబిస్తే తప్ప.. అభ్యర్థి, తన కుటుంబసభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేసింది. అతడు/ఆమె తన అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాల్లో గోప్యతను పాటించే హక్కు వారికి ఉందని తెలిపింది. ఈసందర్భంగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా కరిఖో  ఎన్నికను సమర్థించింది. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.

కరిఖో ఎన్నికపై ఆయన ప్రత్యర్థి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కరిఖో తన నామినేషన్‌లో భార్య, కుమారుడికి చెందిన మూడు వాహనాల వివరాలు వెల్లడించకుండా ప్రభావం చూపారని తెలిపారు. కరిఖో నామినేషన్ వేయడానికి ముందే ఆ వాహనాలు గిఫ్ట్‌గా ఇవ్వడమో, విక్రయించడమో చేశారని గుర్తించిన కోర్టు.. వాటిని ఆ కుటుంబానికి చెందినవిగా పరిగణించలేమని పేర్కొంది. ఈ సందర్భంగా పిటిషనర్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. అలాగే ఆయన ఎన్నికల చెల్లదంటూ గువాహటి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు