Electoral Bonds: సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోండి : రాష్ట్రపతికి ‘సుప్రీం’ బార్‌ అసోసియేషన్‌ లేఖ

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చిన తీర్పుపై ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ కోరాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ (SCBA) అధ్యక్షుడు ఆదీశ్‌ సీ అగర్వాలా విజ్ఞప్తి చేశారు.

Published : 13 Mar 2024 00:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఇచ్చిన తీర్పుపై ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ కోరాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ (SCBA) అధ్యక్షుడు ఆదీశ్‌ సీ అగర్వాలా విజ్ఞప్తి చేశారు. ఆల్‌ ఇండియా బార్‌ అసోసియేషన్‌ లెటర్‌ హెడ్‌లో రాష్ట్రపతికి లేఖ రాసిన ఆయన.. ఈ అంశాన్ని మళ్లీ విచారించే వరకు ఆ తీర్పు అమలు చేయకుండా చూడాలన్నారు.

‘రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ల పేర్లను బహిరంగ పరిస్తే వారు బాధితులుగా మారే అవకాశం ఉంది. తక్కువ విరాళాలు ఇచ్చిన వారిని సదరు పార్టీలు దూరం పెట్టడం, వారిని వేధింపులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. స్వచ్ఛంద విరాళాలను అంగీకరించేటప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడమే అవుతుంది’ అని రాష్ట్రపతికి రాసిన లేఖలో అగర్వాలా పేర్కొన్నారు. అందుకే ఈ కేసులో ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ను తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని