Priyanka Chaturvedi: మహిళా ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే..

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేదిపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సత్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీటిపై ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.

Updated : 31 Jul 2023 12:32 IST

ముంబయి: శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేదిపై .. శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్‌ శిర్సత్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  ఆదిత్య ఠాక్రే  ఆమె అందాన్ని చూసే రాజ్యసభలో స్ధానం ఇచ్చారని సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై  ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) స్పందిస్తూ.. ‘ నేను ఎలా ఉన్నానో .. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. ఇవి మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయి. వారి అభిప్రాయాలను గౌరవించండి ’అని ట్విట్‌ చేశారు.

తర్వాత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) కూడా దీనిపై స్పందిస్తూ..‘వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు. ఇలాంటి నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు ఎలా రాజకీయాల్లో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు’ అని మండిపడ్డారు.

అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో అన్న మాటలనే తాను ఇప్పుడు చెప్పానని సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రియాంక చతుర్వేది 2019లో కాంగ్రెస్‌ను వీడి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నేతృత్వంలో శివసేనలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని