Union Cabinet: కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కొలువైంది. మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. అందులో నరేంద్ర మోదీతో సహా ఏడుగురికి గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.

Updated : 09 Jun 2024 22:53 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కొలువైంది. మొత్తం 72 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరిలో నరేంద్ర మోదీతో సహా ఏడుగురికి గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండటం గమనార్హం.

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పనిచేశారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (మధ్య ప్రదేశ్‌), రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌), మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (హరియాణా), సర్బానంద సోనోవాల్‌ (అస్సాం), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక), జితిన్‌ రామ్‌ మాంఝీ (బిహార్‌) సీఎంలుగా సేవలందించారు. వీరిలో ఐదుగురు భాజపాకు చెందిన నేతలు కాగా.. జేడీఎస్‌ కుమార స్వామి, హిందుస్థానీ అవామ్ మోర్చా నేత మాంఝీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని