Video: అయ్యో.. పేకమేడల్లా కూలిన ఆ ఇళ్లను చూశారా?

హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా కొండచరియలు విరిగిపడటంతో శిమ్లాలోని కృష్ణానగర్‌ ప్రాంతంలో కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 16 Aug 2023 02:02 IST

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)లో కురుస్తోన్న భారీ వర్షాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తోన్న కుండపోత వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తాజాగా భారీ కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. శిమ్లాలోని కృష్ణానగర్ ప్రాంతంలో సెకన్ల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన  దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.  ఇళ్లు కూలిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలకు తోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కొట్టుకుపోయిన ఘటనల్లో మృతుల సంఖ్య 55కి చేరినట్టు సమాచారం. గల్లంతైన వారి కోసం కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు గాలిస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షిగా ఉన్న స్థానిక కౌన్సిలర్‌ బిట్టు పన్నా తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘మేం ఇళ్లలో కొన్ని పగుళ్లను గమనించాం. అదే సమయంలో కొందరు ఘటనా స్థలంలో గుమిగూడారు. పగుళ్లు ఇంకా వ్యాపిస్తున్నాయని.. నివాసాలను ఖాళీ చేయాలని అందరినీ అభ్యర్థించాం. అంతలోనే అకస్మాత్తుగా అనేక ఇళ్లు కూలిపోవడం చూశాం. దాదాపు 20-25 ఇళ్లను ఖాళీ చేయించాం. దాదాపు 50 మందిని కాపాడి.. సురక్షిత ప్రాంతాలకు తరలించాం’’ అని తెలిపారు. 

మరోవైపు, రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో 857 రోడ్లు బ్లాక్‌ కాగా.. 4,285 ట్రాన్స్‌ఫార్మర్లు, 889 చోట్ల నీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తినట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఈ వర్షాకాంలో జూన్‌ 24 నుంచి ఆగస్టు 14వరకు రూ.7,171 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్టేట్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అంచనా వేసింది. మొత్తం 170 ఘటనలు నమోదు కాగా.. 9600 మేర ఇళ్లు ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు