ఘోరం.. లోయలో బస్సు పడి 21 మంది మృతి..!

జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 30 May 2024 17:57 IST

జమ్ము: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ఘోర ప్రమాదం జరిగింది. జమ్ము- పూంఛ్ రహదారిపై బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. 21 మంది మృతి చెందారని, 40 మంది గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.

‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌ నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. జమ్ములోని అఖ్నూర్ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. జమ్ము-పూంఛ్ రహదారిపై అదుపుతప్పి లోయలో పడిపోయింది’’ అని వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయని చెప్పారు. గాయపడిన వారిని అఖ్నూర్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ‘‘ఈ ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని